మాదాపూర్ ఓయో హోటల్‌లో యువతి మృతి కేసులో ట్విస్ట్.. వైజాగ్ వెళ్లి లైజాల్ తాగిన నిందితుడు శ్రీనివాస్  

మాదాపూర్ ఓయో హోటల్‌లో యువతి  మృతి కేసులో ట్విస్ట్.. వైజాగ్ వెళ్లి లైజాల్ తాగిన నిందితుడు శ్రీనివాస్  

హైదరాబాద్: మాదాపూర్‌లోని ఓ ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస రవితేజను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల విచారణలో నిఖిత (29), శ్రీనివాస రవితేజ గత నాలుగేళ్లుగా కలిసి ఉంటున్నట్లు నిందితుడు తెలిపాడు. తనను వివాహం చేసుకోవాలని నిఖిత తరచూ ఒత్తిడి చేయడంతో ఇద్దరి మధ్య కొంతకాలంగా వివాదాలు జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.ఈ క్రమంలో ఇద్దరి మధ్య మరోసారి ఘర్షణ జరగగా, ఆగ్రహంతో శ్రీనివాస రవితేజ యువతిపై దాడి చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. తీవ్రంగా గాయపడిన నిఖిత అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ALSO READ : పిల్లల సోషల్ మీడియాలో ఖాతాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం

యువతి మృతి చెందిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో తన ఇంటికి వెళ్లిన శ్రీనివాస రవితేజ లైజాల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  చికిత్స అనంతరం నిందితుడు పూర్తిగా కోలుకోవడంతో  పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిన్న అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ  కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో నిందితుడిని జైలుకు తరలించారు.